-కమిషనర్ కె.దినేష్ కుమార్
-నగరంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోనడం జరుగుతోందని కమిషనరు కె.దినేష్ కుమార్ తెలియచేసారు.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం డీలక్స్ సెంటర్ మరియు శ్యామలా ధియేటరు జంక్షనులో జరుగుతున్న డిసిల్టేషను పనులను క్షేత్రస్థాయిలో పారిశుద్ద్య విభాగము మరియు ఇంజనీరింగు విభాగము అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఊహించని విధముగా అధిక స్థాయిలో వర్షము కురిసిన సందర్భములో ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రాంతాలు ముంపునకు గురికావడం జరుగుతుందన్నారు. ఆ పరిస్థితిని కూడా అధిగమించడం కొరకు నగరంలో రూ.50 కోట్లు వ్యయముతో డ్రైన్లు నిర్మించడం జరుగుతుందన్నారు. రూ.7 కోట్ల వ్యయంతో షిర్డీ సాయి మార్గ్ లో నిర్మించుచున్న కాలువ పూర్తి కావచ్చుచున్నదని దినేష్ కుమార్ అన్నారు. డీలక్స్ సెంటరు , శ్యామలా ధియేటర్ వద్ద గల అలాగే స్టేడియం రోడ్డులోని కొన్ని వ్యాపార సంస్థలు కాలువలను పూర్తిగా మూసివేస్తూ మెట్లు ర్యాంపులు వంటివి నిర్మించారని వాటిని తొలగించి కాలువలలోని సిల్టును పూర్తిగా తొలగించుచున్నామని తెలియచేసారు. పాత నగరంలో గుండు వారి వీధి, శ్యామలా ధియేటరు, డీలక్సు సెంటరు మరియు గోదావరి గట్టు ఆనుకున్న రోడ్డులలో వున్న కాలువలను ఆధునీకరించడం జరుగుతున్నట్లు తెలిపారు . అమృత్ పధకంలో నిర్మించిన కాలువలను కలుపుతూ రూ.96 లక్షల వ్యయంతో కాలువలను నిర్మిస్తున్నామని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శ్యామలా ధియేటర్ సెంటరులో కాలువలను ఆధునీకరించడానికి మరియు డ్రైన్లలో సిల్టును ఎప్పటికప్పుడు సులువుగా తొలగించడానికి వీలుగా డ్రైన్లపై ఇనుప గ్రిల్సును ఏర్పాటు వేయడానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేయడమైన దన్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపరెంటెండెంట్ ఇంజినీర్ జి.పాండు రంగారావు, మున్సిపల్ హెల్త్ అధికారి డా. ఎ.వినూత్న, ఎగ్జిక్యూటివ్ యింజనీరు శేషగిరిరావు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ యింజనీరు ప్రకాశరావు, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, సహాయ యింజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News