ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా జిల్లాల వారీగా సాధారణ సౌకర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్లు) వాటికి సంబంధించిన మౌళిక సుదుపాయాలు, ఇతర మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు ఎన్ని ఏర్పాటు చేయబడ్డాయి? అలాగే ఎన్టీఆర్ జిల్లాలో గత ఐదేళ్లలో సాధారణ సౌకర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్ల) కింద ఏ విధమైన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం జరిగిందో తెలిపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ గురువారం కేంద్ర మైక్రో, చిన్న మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ను ప్రశ్నించటం జరిగింది. ఈ ప్రశ్నలకు కేంద్ర మైక్రో, చిన్న మధ్యతరగతి పరిశ్రమల సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే బదులిస్తూ గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ చిన్న పరిశ్రమల – క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (MSE-CDP) కింద, సాధారణ సౌకర్య కేంద్రాలు (CFCs)- 07, మౌళిక సదుపాయ అభివృద్ధి (ID) ప్రాజెక్టులు-21 ఆమోదించబడినట్లు తెలిపారు. . 2021-22 ఏడాదిలో జగ్గయ్యపేటలో సాధారణ సౌకర్య కేంద్రం కింద గోల్డ్ ఆభరణాల క్లస్టర్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.
Tags delhi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …