సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సోమవారం ఉదయం సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు సూళ్లూరుపేట నియోజక వర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు ఆర్డీఓ సూళ్లూరుపేట కిరణ్మయి తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు. కంప్యూటర్ల ఏర్పాటుతో అర్జీ దారుల గ్రీవెన్స్ నమోదు చేసి రసీదు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
Tags tirupathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …