-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్
-అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువు లోపు సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత సమయంలోగ పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను త్వరిత గతిన గడువులోపు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు డి ఆర్ ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -53, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -4, పౌర సరఫరాల శాఖ-1, మున్సిపల్ ఆఫీసు -3, సెర్ప్ – 4, పంచాయతీరాజ్ – 8, దేవాదాయ శాఖ -2, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ – 2, విద్యుత్ శాఖ – 1, పోలీస్ శాఖ – 1, టీడ్కో -2, నీటి సరఫరాల శాఖ -1 వెరసి మొత్తం 82 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.