-యూటీఎఫ్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్17, 18, 19, 20 తేదీలలో ఉన్నత పాఠశాలలో జరగబోయే SAMP పరీక్ష పేపర్లను ఉదయము మరియు సాయంత్రం ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్ కి గంట ముందు వెళ్లి పేపర్లు తెచ్చుకుని పరీక్ష నిర్వహించాలి అని ఉన్నత అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కె యస్ యస్ ప్రసాద్ ఖండించారు. పరీక్ష పేపర్లు లీకవుతున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి ముందుగానే తీసుకువెళ్ళినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పేపర్ల లీజేజికి కారణమయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్ కు 15 నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అంత దూరం నుంచి పేపర్లు పట్టుకెళ్ళినప్పుడు కూడా ప్రశ్నాపత్రాలు భద్రతకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి విద్యాశాఖ అధికారులే నేరుగా పాఠశాలకు పరీక్ష పేపర్లు సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని లేదా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మాదిరి హెడ్ మాస్టర్లు పరీక్ష పేపర్లు తీసుకు వెళ్ళడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.