విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండప్రాంతం లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న యెడల వైస్సార్సీపీ కార్పొరేటర్ ల దృష్టికి తీసుకువస్తే తగు పరిష్కరానికి కృషి చేస్తామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 6 వ డివిజిన్ బ్రహ్మానంద వీధిలో కొండచరియలు విరిగిపడి నిరుపేద కుటుంబలకు చెందిన దివ్య,లక్ష్మీ ల నివాసాలు దెబ్బ తిన్న విషయం స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ అవినాష్ దృష్టికి తీసుకురాగా ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వర్షాలు కారణంగా కొండ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి అని కావున ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోకి నీరు చేరిన,మురుగునీరు నిలిచి సమస్యలు వచ్చిన మా కార్పొరేటర్ లు నిత్యం మీకు అందుబాటులో ఉంటారని వెంటనే వారి దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని సూచించారు. ఈ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజ, ఆంధ్రప్రదేశ్ నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ యర్నేటి సుజాత, డివిజన్ నాయుకులు సంపత్, ప్రభు, హరీష్, బొమ్మనశ్రీను, కోటేశ్వరరావు, నాగేంద్ర, పడాల లక్ష్మణ మరియు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను సరఫరా చేయటం జరిగింది
-రాష్ట్రంలో 65 శాతం ఉచిత ఇసుకను జిల్లా నుంచి అందించాం. -మార్చి మొదటి వారం నాటికి మరో 58 లక్షల …