-ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజాకి వినతి పత్రం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరంలో ఆజాద్ నగర్ సర్వే నెంబర్ 120 లో గల 14 ఎకరాల 25 సెంట్లు పీర్ల చావిడి సంబంధించిన వక్ఫ్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వక్ఫ్ స్థలంలో కనీసం మసీదు నిర్మాణం చేయడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ముస్లింలలోని కొన్ని తెగలవారు దీనికి వెనుక కథ నడుపుతున్నారని ఒంగోలు మహమ్మదీయ మజీద్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాసిం ఆరోపిస్తున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆహాలే సున్ని జమాత్ కో కన్వీనర్ మహ్మద్ ఆల్తాఫ్ రజా కలిసి తమ సమస్యలను ఆయనకు వివరించి తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై అధికారులను సంప్రదించిన తమకు న్యాయం జరగడం లేదని, మొహరం పండుగ జరుపుకునే పీర్ల చావిడి కూడా పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయిందని కావున అల్తాఫ్ రజా అధికారులతో మాట్లాడి అన్యాక్రాంతమైన వక్ఫ్ స్థలాల ను కాపాడి, మసీద్ నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరారు. తప్పకుండా సమస్యను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వక్ఫ్ బోర్డ్ సీఈవో దృష్టికి తీసుకువెళ్లి మసీదు నిర్మాణానికి అన్యాక్రాంతమైన టువంటి భూముల పరిరక్షణకు కృషి చేస్తానని అల్తాఫ్ బాబా వారికి హామీ ఇచ్చారు.