విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం వేదపాఠశాల (శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం) విద్యార్థులు గురుపూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేద వ్యాస మహర్షి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి, వేదవిద్యాలయ స్థాపనకు స్ఫూర్తిప్రదాతలు శ్రీవారి ప్రతినిధి శ్రీ యోగానంద వీరధీర సుందర హనుమచ్ఛాస్త్రి సద్గురువుల చిత్రపటాలను పుష్పమాలలతో అలంకరించారు. విధివిధానంగా పూజ నిర్వహించి, వ్యాసాష్టకం పారాయణ చేశారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కప్పగంతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మానవజీవితానికి సార్థకత సద్గురు అనుగ్రహవం వల్లనే కలుగుతుందన్నారు. గురువును మించిన దైవం లేడని, గురు కటాక్షం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని వివరించారు. వేదపాఠశాల ప్రధానాచార్యులు శ్రీ కప్పగంతు జానకిరామావధాని, అధ్యాపకులు శ్రీ కపిలవాయి రైవతశర్మలకు విద్యార్థులకు గురుసత్కారం చేశారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …