విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం స్థానిక 6 వ డివిజిన్ లో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్నాధ్ తో కలిసి పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం పైగా హామీలను అమలు చేయడంతో పాటు,నేడు ప్రజలలోకి వెళ్తుంటే ప్రభుత్వ పనితీరుపై, సంక్షేమ పథకాలు అమలు తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ వైస్సార్సీపీ నాయకుల కు బ్రహ్మరథం పడుతున్నారు అని,రాబోయే 30 సంవత్సరలు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రజలు కోరుకొన్న విధంగా సహాయం అందజేస్తున్న ఘనత ప్రభుత్వానిదే అని, హామీ ఇవ్వకపోయినా సరే కాపు మహిళల సంక్షేమం కోసం కాపు నేస్తం వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. సచివాలయ,వాలంటర్ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజలు గతంలో లాగా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందజేయడం, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడం చేస్తున్నారు అని తెలిపారు. ప్రజలలో రోజురోజుకీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు చేసే నీచ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఇక వారి పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. చిట్టచివరి పేదవాడి వరకు సంక్షేమ పథకాలు అందాలి అనే లక్ష్యంతో ఈ పరిష్కార వేదిక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని, ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వలన పధకం అమలు కాకపోతే ఈ పరిష్కార వేదికలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు.6 వ డివిజన్ లో కొండప్రాంతం అధికంగా ఉందని ఈ ప్రాంత అభివృద్ధి కి ప్రత్యేక దృష్టి పెట్టి నూతన మెట్ల మార్గాలు, రైలింగ్, మంచినీటి పైప్ లైన్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏ నమ్మకం తో అయితే దాదాపు 1300 ఓట్ల మెజారిటీ తో వైస్సార్సీపీ కార్పొరేటర్ అమర్నాధ్ ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నిత్యం మీకు అందుబాటులో ఉంటూ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, స్టాండింగ్ కమిటీ మెంబర్లు అంబేద్కర్, రామిరెడ్డి, కార్పొరేటర్లు, ఇంచార్జిలు మరియు డివిజన్ నాయకులూ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …