Breaking News

స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
43వ డివిజన్లో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తమై యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుచున్నవని, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ టీడీపీ అధ్యక్షులు  దూది బ్రహ్మయ్య ఆదివారం కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు  కేశినేని శ్రీనివాస్(నాని) ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ కేశినేని నాని  సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు కొనికి కొండయ్య, గురు ప్రసాద్, రాళ్ళపల్లి మాధవ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *