తుని, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరిజిల్లా తునిమండలం లోవకోత్తూరులో గల లలిత స్వరూపమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆషాడమాసం సందర్భంగా శాకాంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారు మూలవిరాట్ ను పలురకాల కూరగాయలు ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అలాగే అమ్మవారి పంచలోహ విగ్రహాల వద్ద భారీ ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోపక్క ఆషాడ ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు కొండ దిగువ వరకు భక్తులు క్యూకట్టారు.
Tags thuni
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …