గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల 657 టోన్స్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం డివిజన్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ డివిజన్ లో కోవిషీల్డ్ మొదటి డోసును ఒక లక్షా 14 వేల 044 మందికి, రెండవ డోసును 64 వేల 626 మందికి, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న 19 వేల 329 తల్లులకు, 2 వేల 101 మంది గర్భిణులకు, 3 వేల 630 మంది ఉపాధ్యాయులకు వేయడం జరిగిందన్నారు. అలాగే కొవార్టిన్ మొదటి డోసును 20 వేల 166 మందికి, రెండవ డోసును 16 వేల 741 మందికి, ఐదేళ్ళ లోపు పిల్లలున్న 20 మంది తల్లులకు ఇచ్చామన్నారు. కాగా మంగళవారం ఒక్కరోజే గుడివాడ డివిజన్లోని నందివాడ మండలంలో 13 మందికి, గుడివాడ రూరల్ మండలంలో 62 మందికి, గుడివాడ పట్టణంలో 58 మందికి, గుడ్లవల్లేరు మండలంలో 44 మందికి, కలిదిండి మండలంలో 172 మందికి, మండవల్లి మండలంలో 92 మందికి, కైకలూరు మండలంలో 121 మందికి, పామర్రు మండలంలో 190 మందికి, ముదినేపల్లి మండలంలో 60 మందికి, పెదపారుపూడి మండలంలో 134 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 36 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. డివిజన్లో కరోనా పాజిటివిటీ 3. 81 శాతంగా నమోదైందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
Tags gudivada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …