విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అని,అందుకే తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 4 వ డివిజన్, యన్ఏసి కళ్యాణ మండపం దగ్గర డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు గురుంచి వినతిపత్రలు స్వీకరించారు. అదేవిధంగా డివిజిన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి కాలనీ, పెద్దలు తన దృష్టికి తీసుకువచ్చిన పెండింగ్ పనుల గురుంచి సంబందిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హత ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం పెట్టుకొన్నట్టు,అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వలన ఎవరికైనా ఏదైనా పధకం అమలు కాకపోతే ఈ పరిష్కార వేదిక ద్వారా మాకు తెలియజేస్తే వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నుండి కూడా గల్లా పద్మావతి ప్రజలతో మమేకమై కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్నో సేవ కార్యక్రమలు చేపట్టడంతో పాటు,డివిజన్ అభివృద్ధి కి ఎనలేని కృషి చేసారని,దాదాపు కోటిన్నర ఖర్చుతో ఈ డివిజిన్లో రోడ్లు వేశాం అంటే ఆమె కృషి ఎంతో ఉందని కొనియాడారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి చెందిన సరే నిరాశ పడకుండా మరింత ఎక్కువ సమయం ప్రజలకు కేటాయించి వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నందుకు ఆమెను అభినందించారు. అభివృద్ధి, సంక్షేమం లకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని,అందుకు నిదర్శనమే ప్రజలలో ప్రభుత్వం పట్ల వస్తున్న స్పందన అని అన్నారు.ప్రతిపక్షాలు ఇక జూమ్ కె పరిమితం అని,కేవలం వారి రాజకీయా మనుగడ కోసం,రోజు పేపర్ లో పేరు రావాలనే కల్పిత కథలతో, డ్రామాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు అని,వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు.
మహిళ రక్షణకు దిశ ఆప్ : దేవినేని అవినాష్
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని, ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే ఆదుకొనెల దిశ ఆప్ తీసుకొచ్చారని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మీ మీ ఫోన్ లో ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఆపద వస్తే బటన్ నొక్కగానే దగ్గరలో ఉన్న పోలీసులు వచ్చి రక్షణ గా నిలుస్తారని సూచించారు. ఈ యాప్ తో మహిళా రక్షణ లొనే దేశంలోనే ఆదర్శంగా నిలిచారనిఅన్నారు.పటమట మహిళ ఎస్.ఐ వెళ్లి గారు వచ్చి దిశా యాప్ యొక్క వినియోగం,ఆవశ్యకత గురించి మహిళలకి దిశ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, నాగవంశ డైరక్టర్ ఎర్నేటి సుజాత, డివిజన్ ఇంచార్జిలు కొత్తపల్లి రజిని, వల్లూరి శారదా దేవి, ఉకోటి రమేష్, వైసిపి నాయకులు కావటి దామోదర్, బచ్చు మాదవి, బొడ్డు తరుణ్, జయరాజు, ప్రసాద్ రెడ్డి, షోకాత్ అలీ, జేజే సింగ్ తదితరులు పాల్గొన్నారు.