అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎయిమ్స్ నందు ఆగస్ట్ 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన మహోత్సవానికి విచ్చేయనున్నారు. బుధవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎయిమ్స్ డైరెక్టర్, అదికారులు, ఎంటిఎంసి తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్ట్ 5వ తేదీన జరగబోయే వన మహోత్సవానికి సీఎం జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేయనున్నారు అని అన్నారు. దాదాపు 1000 మందితో మీటింగ్ ఏర్పాటుకు స్థలం పరిశీలించడం జరిగిందని, 2000 వేల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.
