Breaking News

జిల్లాలో నిర్మాణదశలో ఉన్న జాతీయ రహదారుల పనుల్లో వేగం పెంచండి… : కలెక్టరు జె.నివాస్

-గొల్లపూడి-జక్కంపూడి- పెదవుటపల్లి బైపాస్ పనుల్లో ప్రగతి తీసుకురండి…
-గన్నవరం విమానాశ్రయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం…
-బెంజిసర్కిల్ వెస్ట్రన్ సైడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు 80 శాతం పూర్తి…
-రైల్వే ప్రాజెక్టు పనులు చురుకుగా ముందుగా తీసుకు వెళ్లండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేషనల్ హైవేస్, రైల్వేకు సంబంధించి నిర్మాణదశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని
జిల్లా కలెక్టరు జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలో చేపట్టిన, చేపట్టబోతున్న జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్, విజయవాడ మినీ బైపాస్ రోడ్, కొండపల్లి-కాజీపేట రైల్వే లైన్ కు సంబంధించి ఆర్ఓఆర్ నిర్మాణం, ముస్తాబాదా-గొల్లపూడి మధ్య క్రొత్త లైన్ ఏర్పాటు, తదితర పనుల ప్రగతిపై నేషనల్ హైవే, రైల్వే, రెవెన్యూ శాఖాధికారులతో కలెక్టరు జె. నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంజిసర్కిల్ వెస్ట్రన్ సైడ్ 2.40 కిలోమీటర్ల మేర చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణపనులు 80 శాతం పూర్తయినందున మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నందిగామ-కంచికచర్ల బైపాస్ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 900 మీటర్ల పనులను వచ్చే సమావేశం నాటికి పూర్తి చేయాలన్నారు. విజయవాడ బైపాసకు సంబంధించి పనులపై కలెక్టరు సమీక్షించారు. జక్కంపూడి- గొల్లపూడి మధ్య ఆ ఓబి నిర్మాణంకు సంబంధించి ఏమేర ఎత్తు ఉండాలనే వివరాలను అధికార పూర్వకంగా యన్ హెచ్ అధికారులకు రైల్వే అధికారులు అందించాలన్నారు. కలపర్రు నుంచి చిన అవుటపల్లి వరకూ 6 లైన్ల యన్ హెచ్-16 జాతీయ రహదారి పనులు 96 శాతం పూర్తి చేసారని అయితే హనుమాన్ జంక్షన్ బైపాస్ వద్ద వివిధ నిర్మాణపనులు, డ్రెయిన్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం -విజయవాడ జాతీయ రహదారికి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కత్తిపూడి-ఒంగోలు యన్ హెచ్ కు సంబంధించి పనుల పై కలెక్టరు జె.నివాస్ సమీక్షిస్తూ ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 లలో కొద్దిపాటి భూ సేకరణకు సంబంధించి పనులు పూర్తి చేయాలన్నారు. పామర్రు-ఆకివీడు మధ్య 5 మండలాల పరిధిలోని 64 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు ఇప్పటికే 90 శాతం భూమి అప్పగించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి 31 గ్రామాలకు గాను 30 గ్రామాలు భూమికి సంబంధించి అవార్డు పాస్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తయిన కొన్ని ప్రాంతాలలో అప్రోచ్ రోడ్డులను నిర్మించ లేదని వాటిని త్వరితగతిన నిర్మించాలని యన్ హెచ్ అధికారులను కలెక్టరు ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులన్నింటినీ సంబంధిత కాంట్రాక్టర్లతో ప్రభుత్వం నిర్ణయించిన ఒప్పంద తేదీలలోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇంకా భూసేకరణలో చిన్నచిన్న సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్, ఆర్ డిఓలు కె. రాజ్యలక్ష్మి, శ్రీనుకుమార్, నేషనల్ హైవే పిడి నారాయణ, మేనేజరు సాహు, పలువురు నేషనల్ హైవే అధికారులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Check Also

గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు

-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *