అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ యార్డ్ నందు సుమారు 8 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని అధికారుల లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, త్వరలో ఉన్నతాధికారులను కలిసి ఈ నిధులను మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరికీ ఉపయోగించే విధంగా టార్పాలిన్ పట్టాలను, తైవాన్ స్ప్రేయర్లను అద్దెకు ఇచ్చే విధంగా, వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఆర్బికెల ద్వారా రైతుల అబివృద్ధికి ఎంతో కృషి చేశారని, మార్కెట్ యార్డ్ ద్వారా మరింత మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అందరం కలిసి తీర్మానం చేయటం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించామని అన్నారు.
Tags AMARAVARTHI
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …