Breaking News

విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన సీఎం వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదర్శంగా నిలిచారు  … 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో జగనన్న విద్యాదీవెనె రెండవ విడత క్రింద 93,189 మంది విద్యార్ధులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ. 68.14 కోట్లు ఆన్ లైన్ ద్వారా జము చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యాదీవెన పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెనె రెండవ విడత ఆర్ధిక సహాయాన్ని వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు జె. నివాస్, ఎమ్మెల్సి యండి కరీమున్నీసా, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, కె. రక్షణనిధి, మేయరు రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్, సోషల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు సరస్వతి, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నాడు-నేడు పధకాన్ని యధాతథంగా అమలు చేయాలని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు. ఢిల్లీతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలలో ఈపధకం అమలు తీరును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిని ధమ్మున్న సియంగా ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తాంశంగా పేర్కొనడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యాదీ వెనె క్రింద మొదటి విడతలో రూ. 66.48 కోట్లు అందించగా, రెండవ విడతగా రూ. 68.14 కోట్లు అందించడం జరుగుతున్నదన్నారు. ఇందులో భాగంగా రెండవ విడతలో యసిసి వర్గాలకు చెందిన 23,237 మంది విద్యార్ధులు ఉండగా, 20,389 మంది తల్లుల ఖాతాల్లో రూ. 1627.58 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. యటి వర్గాలకు చెందిన 2,444 మంది విద్యార్ధులు ఉండగా, 2,181 మంది తల్లుల ఖాతాల్లో రూ. 156.89 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. బిసి వర్గాలకు చెందిన 39,527 మంది విద్యార్థులు ఉండగా, 34,684 మంది తల్లుల ఖాతాల్లో రూ. 2762.90 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఇబిసి వర్గాలకు చెందిన 10,707 మంది విద్యార్థులు ఉండగా, 9,664 మంది తల్లుల ఖాతాల్లో రూ. 978.21 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన 5,145 మంది విద్యార్థులు ఉండగా, 4,553 మంది తల్లుల
ఖాతాల్లో రూ. 369.90 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. కాపు వర్గాలకు చెందిన 11,074 మంది విద్యార్థులు ఉండగా, 9,719 మంది తల్లుల ఖాతాల్లో రూ. 840.72 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. క్రిష్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన 1,055 మంది విద్యార్ధులు ఉండగా, 917 మంది తల్లుల ఖాతాల్లో రూ. 78.09 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు.
ఈసందర్భంగా లబ్బీ పేట సిద్ధార్ద డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న భావన మాట్లాడుతూ జగనన్న విద్యాదీ వెనెతో ఎంతోమంది మంచిగా చదువుకుంటున్నారన్నారు. ఈసహాయంతో మాతల్లిదండ్రులు అప్పులు చేయకుండా వెసులుబాటు కలిగిందన్నారు. అందుకు తగిన విధంగా మేము మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెస్తామన్నారు. భావన తల్లి ఇందిర కూడా జగనన్న విద్యాదీవెనె ఎంతోమంది చదువుకోవడానికి బాసటగా నిలుస్తుందన్నారు. విజయవాడకు చెందిన లక్ష్మీకుమారి మాట్లాడుతూ తనకు ఒక పాప, బాబు ఉన్నారని జగనన్న విద్యాదీవెనె సహకారంతో ఇంజినీరింగ్ చదువుతున్నారన్నారు. కుమార్తె ఇంజినీరింగ్ తుది సంవత్సరం చదువుతుండగా అబ్బాయి ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారన్నారు. జగనన్న విద్యాదీవెనె, వసతి దీవెనెలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అలాగే కాపునేస్తం తమకు ఎంతో బాసటగా నిలిచిందన్నారు. మరీ ముఖ్యంగా కరోనావంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రాని స్థితిలో ఇంటికే రేషన్ అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈప్రభుత్వం మళ్లీ మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆగిరిపల్లి యన్ ఆర్ ఐ కళాశాలలో రెండవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న మోహన్ కృష్ణ అనే విద్యార్థి తల్లి ఉష మాట్లాడుతూ తనకు ఇద్దరు పిల్లలు ఉండగా పెద్దాడు చదివే సమయంలో ఇలాంటి పధకం లేదన్నారు. రెండవ కుమారుడైన మోహనకృష్ణ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాలిటెక్నిక్ చదివాడని ఆతర్వాత వైజాగ్ లో చిన్న ఉద్యోగం చేసినప్పటికీ సంతృప్తి చెందక ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాడన్నారు. జగనన్న విద్యాదీ వెనెతో తిరిగి బి.టెక్ చదివేందుకు కళాశాలలో చేరాడన్నారు. వాడి కలనెరవేరడంతో పాటు నాకూ ఎంతో ఆనందం కలిగిందని ఇందుకు కారణమైన సియం జగన్మోహన రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *