ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంకా ప్రభుత్వ పధకాలు పొందని నిరుపేదలను గుర్తించి వారికి సంక్షేమ పధకాల లబ్దిని అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్టున్న సంక్షేమ కార్యక్రమాలపై నిరుపేద ప్రజలకు అవగాహన కలిగించి, సామాజిక పెన్షన్, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు, రైతు భరోసా, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా వంటి సంక్షేమ పధకాల లబ్దిని వారు సద్వినియోగం చేసుకునేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారని, ఈ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం సిద్ధేంచేలా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలను అవగాహన కలిగించేలా పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. అంతేకాక ఆ పోస్టర్ల కింద ఆ పధకం ద్వారా లబ్ది పొందిన వారి జాబితాను ప్రదర్శించాలి కలెక్టర్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. అక్కడే నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనం, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలనీ కాంట్రాక్టర్ లను కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు తమ విధులకు సంబంధించి రిజిస్టర్లు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ సూర్యారావు , ఎంపిడిఓ దివాకర్, పంచాయతీ రాజ్ ఏ ఈ శ్రీనివాసరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ నాగేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి శైలజ, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Tags ibrahimpatnam
Check Also
రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …