మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనదారులు రోడ్డు దాటే సమయంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు. సోమవారం ఆయన విజయవాడ నుండి మచిలీపట్నంలో జరిగే స్పందన కార్యక్రమానికి వస్తున్న సమయంలో గూడూరు మండలం తరకటూరు వద్ద అప్పుడే జరిగిన వాహన ప్రమాదంను కలెక్టర్ జె. నివాస్ గుర్తించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందోనని స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. యాక్టివా బైక్ పై వెళ్లున్న మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన అబ్దుల్ ఉల్ఫాస్ (38 సం.రాల) యువకుడు రోడ్డు డివైడర్ పై నుండి దాటుతుండగా విజయవాడ నుండి మచిలీపట్నానికి వెళ్లుతున్న కారు వేగంగా ఆ ద్విచక్రవాహనాన్ని ఢీ కోట్టింది. దీనితో ఆ యువకుడు రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్నాడు. తక్షణమే కలెక్టర్ బాధి తుని దుస్థితిని గమనించి మానవత్వంతో స్పందించారు. 108 ఆంబులెన్సుకు ఫోన్ చేసి సంఘటన స్థలానికి నిమిషాల వ్యవధిలో రప్పించారు. అలాగే డిఎస్ పికి స్వయంగా ఫోన్ చేసి పోలీసులను ప్రమాదస్థలానికి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, జాతీయ రహదారి పై ప్రయాణించే వాహనదారులు, రోడ్డును అడ్డంగా దాటి నడిచివెళ్లే వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు దాటేందుకు డివైడర్ ఎక్కడం సరికాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో విపత్తులు ఎదుర్కొవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వాహనదారులు ప్రయాణించే సమయంలో తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తతో డ్రైవింగ్ పై దృష్టి కేంద్రీకరించాలని హెచ్చరించారు.
Tags machilipatnam
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …