వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆధునీకరణ ప‌నుల శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌

-శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్,ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్
-మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీల‌ను ను స‌త్క‌రించిన ఏసీఏ ప్రెసిడెంట్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం లో ఆదివారం స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణను పురస్కరించుకుని శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ శిలాఫ‌లాకాన్ని ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తో కలిసి శిలాఫలకాన్ని మంత్రి లోకేష్ ఆవిష్క‌రించారు. ఈ సందర్బంగా ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), మంత్రి నారా లోకేష్ శాలువాతో స‌త్క‌రించి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌తిమ‌ను బ‌హుక‌రించారు. అలాగే ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ల‌ను కూడా ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌త్క‌రించారు. అనంతరం వీరంతా స్టేడియంలో జ‌రిగిన‌ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ స‌న్ రైజ‌ర్స్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, ఇతర ఏసీఈ అపెక్స్ మెంబర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ముప్పాళ్ల/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *