-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి రంజాన్ పండుగ ప్రతీక అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలను పూర్తిచేసిన ముస్లిం సోదరులకు అల్లాహ్ శక్తినివ్వాలని మల్లాది విష్ణు ప్రార్థించారు. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి మార్గం చూపే గ్రంధం అని.. మహ్మద్ ప్రవక్త చూపించిన మార్గాన్ని ప్రతీ ముస్లిం అనుసరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని కోరారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని.. అల్లాహ్ దీవెనలతో నియోజకవర్గ ప్రజలకు సకలశుభాలు కలగాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News