Breaking News

మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ల‌కు స్వాగ‌తం ప‌లికిన ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపి కేశినేని శివ‌నాథ్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన విద్య, ఐటీల శాఖ‌మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ల‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎసిఎ వైస్ ప్రెసిడెంట్ వెంక‌ట రామ ప్రశాంత్, ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ లతో కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం ప‌లికారు. ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్టేడియంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి ప‌నుల‌ను మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ల‌కు వివ‌రించి చూపించ‌టం జ‌రిగింది. స్టేడియం ఆధునీకరణ ప‌నుల‌పై మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా హ‌ర్షం వ్య‌క్తం చేయ‌టంతోపాటు ఎసిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని అభినందించారు. అనంత‌రం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ క్రికెట్ మ్యాచ్ వీక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *