Breaking News

ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి రెండూ ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యత

-విద్యుత్ బస్సుల ప్రవేశంతో ఏ ఉద్యోగికీ నష్టం జరగదు – నాలుగు డిపోలను తిరిగి ప్రారంభిస్తాం
-ఉద్యోగ సంఘాలతో సానుకూల చర్చలు ఫలప్రదం – 90 శాతం అంశాలకు పరిష్కారం
-ఎన్. బాల సుబ్రహ్మణ్యం, ఐపీఎస్., వైస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్, APSRTC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుమారు25 అంశాలపై జరిగిన చర్చల్లో 90 శాతం సమస్యలకు పరిష్కార మార్గాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన అంశాలపై కూడా పరస్పర అవగాహన ఏర్పడిందని APSRTC వైస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాల సుబ్రహ్మణ్యం, ఐపీఎస్.తెలిపారు.
RTC హౌస్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ బస్సుల ప్రవేశం నేపథ్యంలో ఉద్యోగుల్లో ఎలాంటి అపోహలు అవసరం లేదని, APSRTC ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, ఉద్యోగుల ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమనిస్పష్టం చేశారు.

నాలుగు డిపోలను పునఃప్రారంభిస్తాం
ప్రధానమంత్రిPM e-Bus Sewaపథకం కింద రాష్ట్రానికి కేటాయించిన750 విద్యుత్ బస్సులను 12 డిపోల పరిధిలో నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమైనవిజయాదరపురం, మంగళగిరి, నెల్లూరు–2, గుంటూరు–2 డిపోలనుఅవసరమైన సివిల్ పనులు పూర్తి చేసి తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ డిపోలు సిద్ధమయ్యే వరకు తాత్కాలికంగా ఇతర డిపోలకు బదిలీ చేసిన ఉద్యోగులను, డిపోలు తిరిగి ప్రారంభమైన వెంటనే తిరిగి అదే డిపోలకు తీసుకొచ్చేలా బదిలీ ఉత్తర్వులను సవరించనున్నట్లు తెలిపారు.

విద్యుత్ బస్సుల నిర్వహణకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ
విద్యుత్ వాహనాల సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డ్రైవర్లు, మెకానికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేస్తామని చెప్పారు. సాంకేతిక మార్పుల నేపథ్యంలో సంస్థ సిబ్బంది నైపుణ్యాలను మరింత పెంపొందించే కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు.

ఉద్యోగ సంఘాలతో కలిసి ముఖ్యమంత్రికి నివేదిక
విద్యుత్ బస్సుల అమలు విధానం, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ, సంస్థ భవిష్యత్ అభివృద్ధి వంటి అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి మరియు APSRTC ఛైర్మన్‌కు సమగ్రంగా వివరించి తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.

RTC ఉద్యోగులపై దాడులు సహించం
RTC ఉద్యోగులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఇటువంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సంబంధిత జిల్లా ఎస్పీలతో మాట్లాడి, RTC ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా కేసులు నమోదు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు.
ప్రజలు ఏవైనా సమస్యలు ఎదురైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సంబంధిత డిపో మేనేజర్ లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి చర్యలు
ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, అలవెన్సులు, క్రమశిక్షణా అంశాలు, ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు తదితర విషయాలపై కూడా విస్తృతంగా చర్చించామని, వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామని వైస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.
అంతిమంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే ఉద్యోగుల సంక్షేమాన్ని పరిరక్షించడం, APSRTCని మరింత బలోపేతం చేయడం మా ప్రధాన లక్ష్యం. యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేస్తే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుంది”అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *