Breaking News

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించి, ఎయిర్‌పోర్టును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
-ఆంధ్రుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న టెర్మినల్ భవనంపై ప్రశంసల వర్షం..సంస్కృతి, ఆధునికతల సంగమం.. గ్లోబల్ ఇమేజ్‌కి చిరునామా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అని అభివర్ణన
-భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక విప్లవం..ఉత్తరాంధ్ర ప్రగతికి ‘భోగాపురం ఎయిర్ పోర్ట్’ గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
-ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు

భోగాపురం,విజయనగరం జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంత రాజకీయ, ఆర్థిక, పర్యాటక వృద్ధికి ప్రధాన చిరునామాగా మారనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం ఆయన సహచర మంత్రులతో, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లోపల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కట్టడాలు, కళాకృతులను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించగా సంబంధిత వివరాలను సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జున రావు వివరించారు. అనంతరం టెర్మినల్ భవనంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ప్రస్ఫుటించేలా చేసిన ఏర్పాట్లను మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..అభివృద్ధికి రెక్కలు వచ్చినట్లుగా, ఉత్తరాంధ్రకు గ్లోబల్ లుక్ వచ్చేలా దర్శనమిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొబ్బిలి వీణలు, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట చిత్రాలు, కలంకారీ పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా ఉంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి శ్రీశైలం, తిరుమల, లేపాక్షి నంది వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మన్యం అందాలను చాటిచెప్పే డిజిటల్ స్క్రీన్‌లు, వాల్ పెయింటింగ్స్‌తో ఆంధ్రా వైభవం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉందని అభినందించారు.’ఫ్లైయింగ్ ఫిష్’ ఆకారంలో రూపొందించిన టెర్మినల్ డిజైన్, విద్యుద్దీపాలంకరణతో అత్యంత సుందరంగా ఉందన్నారు. అంతేగాక ఎయిర్‌పోర్టులోని ఏరో బ్రిడ్జ్, ఏరో ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రన్‌వే, టాక్సీవేలు, ఏప్రాన్ ప్రాంతాలు, అప్రోచ్ రోడ్లను మంత్రి దుర్గేష్ నిశితంగా పరిశీలించారు. హైస్పీడ్ సెక్యూరిటీ స్కానింగ్, ఫాస్ట్ డిజిటల్ చెక్-ఇన్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఇ-గేట్స్, విశాలమైన పార్కింగ్ స్థలాలు, ఎస్క్ లేటర్లు, ఎలివేటర్లు వంటి ఆధునిక వసతులు ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందిస్తాయని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నమూనాను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ రైల్వే జోన్‌తో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.పర్యాటకం, విమానయాన, పారిశ్రామిక రంగాలలో విపరీతమైన అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్ ఈ ఎయిర్ పోర్ట్ అని చెబుతూ.. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో ఇది కీలక భూమిక పోషిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ ఇమేజ్ తీసుకొస్తుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ‘థింసా’ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వెల్లడించారు. ఆగస్టు 1న జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతి ఎస్ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ​తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *