Breaking News

తిరుపతి ఎస్ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
​తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థలో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి 3 ఏళ్ల B.Sc (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్), 10వ తరగతి పూర్తి చేసిన వారికి 1.5 ఏళ్ల క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. ​కోర్సులో భాగంగా 17 వారాల పాటు ప్రత్యక్ష పరిశ్రమ శిక్షణ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్) ఇస్తారని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ప్రముఖ హోటల్ గ్రూప్‌లలోను, దేశ విదేశాల్లోనూ మంచి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ​ఆసక్తి గల విద్యార్థులు www.sihmtpt.org వెబ్‌సైట్ ద్వారా లేదా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 97013 73846, 97004 40604 ఫోన్ నంబర్లలో గానీ, sihmtpt@gmail.com ఇ-మెయిల్‌లో గానీ సంప్రదించవచ్చునని ప్రిన్సిపల్ డా. ఆర్. రమణ ప్రసాద్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *