వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ఐసీసీ ఛైర్మన్ జైషా , , బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్, ఎంపి శ్రీ భరత్, మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు విచ్చేసిన వీరికి ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించారు.
Prajavartha Online Telugu News