విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీల అభివృద్ధి కి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ నందు 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీద జరిగిన అయ్యప్పనగర్ మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ఈ కాలనీ అభివృద్ధి గురుంచి ఇదే ప్రాంతంలో నివసించే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజలు, కాలనీ పెద్దలు ఎన్నిసార్లు తీసుకువేల్లిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఓడిపోయిన నియోజకవర్గాల్లో అభివృద్ధి కి నిధులు ఇచ్చేవారు కాదని కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని భావించి ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసారని అన్నారు.కేవలం ఈ ఒక్క డివిజిన్ లోనే ఈ రెండేళ్ల కాలంలో కోటిన్నర రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ డివిజిన్లో టీడీపీకి 2700 మెజారిటీ వచ్చిందని కానీ వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో పెరుగుతున్న సానుకూలం మరియు మాగంటి నవీన్ నిత్యం అందుబాటులో ఉండే తీరు వలన స్థానిక సంస్థ ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందని,అయిన సరే నిరుత్సాహ పడకుండా నవీన్ నిత్యం ప్రజలలో తిరుగుతూ వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు.
మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
పర్యావరణ పరిరక్షణకు మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం స్థానిక 12 వ డివిజిన్ అయ్యప్పనగర్ నందు జగనన్న పచ్చతోరణం పధకంలో భాగంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కొరకు ట్రి గార్డ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ధనేకుల భారతి జ్ఞాపకార్ధం దాదాపు 30000 రూపాయల విలువ గల కూరగాయలు బండి ని ట్రస్ట్ ద్వారా చిన్న అనే నిరుపేద వ్యక్తి జీవనభృతి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశ డైరెక్టర్ ఎర్నేటి సుజాత,కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి,చింతల సాంబయ్య,అయ్యప్పనగర్ అసోసియేషన్ గుల్లపల్లి వెంకటేశ్వరరావు, వెలగపూడి శేషగిరిరావు, పట్టయ్య,రెహ్మాన్, రాజశేఖర్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.