Breaking News

10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ 7 నుండి 16వ తేదీ వరకూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని అయితే విద్యార్ధుల ఆరోగ్యభద్రత, ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని మే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిర్ణయం మేరకు 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. పరీక్ష ఫీజు కట్టిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు ఎంతో కీలకమని మంత్రి అన్నారు. ఉద్యోగాల నియామకంలో కాలేజీ విద్యలో, కేంద్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు ముఖ్యంగా మిలటరీ రిక్రూట్ మెంట్ లో 10వ తరగతిలోని మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడతారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ పరీక్ష పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని దీనిలో భాగంగా సంవత్సర కాలం పాటు విద్యార్థుల ప్రతిభను ఆధారంగా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. రద్దు అయిన 10వ తరగతి పరీక్షల విధి విధానాలను పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని అన్నారు. ఈ హైపవర్ కమిటి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశామని మంత్రి అన్నారు. విద్యార్థులెవరికీ నష్టం లేకుండా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. అందరికీ ఉపయోగపడేలా 2019-20, 2020-21 సంవత్సరానికి ఎవ్వరూ నష్టపోకుండా 10వ తరగతిలో గ్రేడింగ్ ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి అన్నారు. ఈనివేదికను యధాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు. 2020-21వ సంవత్సరంలో సంవత్సర కాలంపాటు వారి ప్రతిభను ఆధారంగా తీసుకుని వ్రాతపరీక్షల్లో అత్యధిక వెయిటేజ్ ను ఇస్తూ 70 శాతం, 30 శాతం వెయిటేజ్ మార్కులతో గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో 6 లక్షల 26 వేల 981 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 22 వేల 391 మంది బాలురు, 3 లక్షల 04 వేల 036 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 లక్షల 37 వేల 354 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 26 వేల 753 మంది బాలురు 3 లక్షల 10 వేల 601 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు.
10వతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెర్ ఫార్మెన్స్ స్టేట్ మెంట్లు (గ్రేడ్ షీట్లు) కొరకు విద్యార్ధులు htt://results.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి అన్నారు. విద్యార్థులు వారి రోల్ నెంబరును ఎ ంటర్ చేయడం ద్వారా గ్రేడ్ మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. ఈవెబ్ సైట్ కు సంబంధించి పాస్ వర్డు NEP – 2020 అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనరు చినవీరభద్రుడు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సుబ్బారెడ్డి, య ఆర్ టి డైరెక్టరు ప్రతాప రెడ్డి, ప్రకాశం జిల్లా డిఇఓ సుబ్బారావు, పెనమలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు వై. విజయకుమార్, పి. వెంకటకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు

-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *