విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేసే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టరు జె.నివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర స్థాయి స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు చేపట్టిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేడియం గ్రౌండు చుట్టూ త్రివర్ణ రంగులతో కూడిన క్లాత్ తో అలంకరించాలన్నారు. ఆగష్టు 13వ తేదీన డ్రస్ రిహార్సల్ ఉంటుందన్నారు. వర్షం పడినా ఇబ్బంది లేని రీతిలో స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అందుకు అవసరమైన వాటర్ ప్రూఫ్ షామియానాలు వేయాలన్నారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి స్టేడియంలో పల, వెలుపల పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు.
Tags vijayawada
Check Also
సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సదరం సర్టిఫికేట్ల జారీలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల …