విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
75వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉత్తర్వుల మేరకు 15 వ తేది న (ఆదివారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించడమైనది. శనివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ మరియు చేపలను అమ్మిన యెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తిసుకోనబడునని కమిషనర్ గారు ఆదేశించడమైనది. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు ఆదివారం అన్ని షాపులు ముసి వేయవలెనని ఆదేశించడమైనది.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …