Breaking News

రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ ఇస్తాం…

-చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే తేడా ప్రభుత్వానికి లేదు…
-ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలున్నాయి…
-ముఖ్యమంత్రిగా తొలిరోజు తొలిసంతకం చేసిన ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఒకటి…
– కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలుజరి గేలా మెరుగైన ప్యాకేజీ అందిస్తాం…
-ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయుట తగదని, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా ఇవ్వని యాజమాన్యాలతో జర్నలిస్టు నాయకులు పోరాటం చేస్తే బాగుంటుంది…
-ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలుజరి గేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దేవులపల్లి అమర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను పాత్రికేయులకు వివరించారు. ఈసందర్భంగా అమర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలామంది కోవిడ్ తో చనిపోయారని ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ వేవ్ లో ఎక్కువుమంది జర్నలిస్టులు మరణించారని వారి కుటుంబాలకు శాశ్వతమేలు జరి గేలా స్థలాలు, గృహవసతి కల్పిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వంతో మేమెప్పుడుకప్పుడు చర్చిస్తూనే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వలన చనిపోయినవారిని ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నదని ఆయన అన్నారు. కేవలం జర్నలిస్టులు మాత్రమే కాకుండా కోవిడ్ తో చనిపోయిన వారందరినీ ఏదోరకంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆలోచన అని ఆయన అన్నారు. మొదటినుంచి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జర్నలిస్టులపట్ల అనుకూలంగా ఉన్నారని, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా తొలినాటి నుండి కూడా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజున సంతకం చేసిన అతికొద్ది ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఫైలు కూడా ఒకటని  అమర్ అన్నారు. జర్నలిస్టులందరికీ గృహనివాసానికి కావాల్సిన స్థలం ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. జర్నలిస్టు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు న్యాయం జరుగుట లేదని వర్కింగ్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండని, పోరాడమని ప్రభుత్వంపై బురదజల్లడం సమంజసం కాదని దేవులపల్లి అమర్ అన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని స్వయంగా మేము యూనియన్ అధ్యక్షులు అందరికీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని ఆయన అన్నారు. అయినా ప్రభుత్వం పై జర్నలిస్టు సంఘ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని వివరాలు సరిగా తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని ప్రభుత్వంలో మేమున్నాం, అందరికీ న్యాయం జరుగుతుందని దేవులపల్లి అమర్ అన్నారు. పత్రికా యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా గ్రామీణ స్థాయి పాత్రికేయులకు కనీస వేతనాలివ్వని పత్రికా యాజమాన్యాలను నాయకులు ఎందుకు అడగరని అమర్ ప్రశ్నించారు. పాత్రికేయుల సంక్షేమానికి అనేక రాయితీలు ఇస్తున్నా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం జర్నలిస్టు సంఘ నాయకులకు తగదని  అమర్ అన్నారు. గత రెండు సంవత్సరాలకాలంలో ఎక్కడ జర్నలిస్టులు పై దాడులు జరిగాయో వాస్తవాల ఆధారంగా నిరూపించాలని జర్నలిస్టు సంఘ నాయకులను దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వేధిస్తున్నారని పత్రికల్లో వ్రాయడం చాలా విచారకరమని ఆయన అన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకుందని ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)ని జర్నలిస్టు నాయకులు కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన నాయకులే జాతీయ నాయకులతో కలిసి ప్రభుత్వం పై బురదజల్లడం సబబు కాదని  దేవులపల్లి అమర్ అన్నారు.

అర్హులందరికీ అక్రిడిటేషన్ అందిస్తాం…
అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ప్రభుత్వం అక్రిడిటేషన్ అందిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాలుగా అక్రిడిటేషన్లు ఇవ్వలేదనేది కరెక్ట్ కాదని ఇవ్వలేదని ఆరోపణలు చేసేముందు వాస్తవాలు ఆలోచించాలని ఆయన అన్నారు. గత రెండు సంవత్సరాల మూడు నెలల నుండి కోర్టులో ఏమి జరుగుతుంది, అక్రిడిటేషన్లు ఎందుకివ్వలేకపోయామనేది జర్నలిస్టుల మిత్రులందరికీ తెలుసునని ఆయన అన్నారు. అయినా ప్రభుత్వం కోర్టు ఆదేశాలు మేరకు అర్హతగల పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్లను అందిస్తున్నామని ఆయన అన్నారు. అన్నీ జిల్లాల్లోనూ అక్రిడిటేషన్ల జారీ కార్యక్రమం కొనసాగుతున్నదని, ఏ జిల్లాలో ఎన్ని అక్రిడిటేషన్లు మంజూరు అయ్యాయన్న వివరాలు తనవద్దనున్నాయని ఆయన అన్నారు. చిన్నపత్రిక, పెద్ద పత్రికా అనే తేడా ఏమీ లేదని అర్హులందరికీ అక్రిడిటేషన్ అందుతుందని ఆయన అన్నారు. అక్రిడిటేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసి ప్రతీ ఒక్క జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ అందేలా రాష్ట్ర సమాచార శాఖామంత్రి  పేర్ని నాని కసరత్తు చేస్తున్నారని అమర్ అన్నారు. కరోనాబారినపడిన జర్నలిస్టుల కుటుంబాలకు గృహవసతి, నివాసస్థలంతో కూడిన మేలైన ప్యాకేజీ అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రెస్ అకాడమి ఛైర్మన్ శ్రీనాధ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు జర్నలిస్టు నాయకులతో సమావేశ మై ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని వివరించారని ఆయన అన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *