అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన వై.వి.సుబ్బారెడ్డిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో మర్యాదపూర్వక భేటీ అయిన మల్లాది విష్ణు మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించడం సంతోషదాయకం అన్నారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితాలో వై.వి.సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం ఆనందదాయకం అన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలిపారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …