-బుల్లా కు మద్దతుగా తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్.. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
53 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి బుల్లా విజయ్ కుమార్ చివరి రోజైన శుక్రవారం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.. డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బుల్లా కు మద్దతుగా తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ లో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.
మరింత అభివృద్ధి కోసం మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కృష్ణ కు గ్లాస్ గుర్తుపై తనకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు బుల్లా విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కూటమి నాయకులు నున్న కృష్ణ, బడుగు వెంకన్న, పల్లె పోగు ప్రసాద్, చాట్ల రాజశేఖర్, కత్తి డేవిడ్ ,కే విక్టోరియా కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
