-40 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి పగడాల వెంకట రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఊర్మిళానగర్ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 40 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి పగడాల వెంకట రామకృష్ణ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో చివర రోజైన శుక్రవారం ఊర్మిళ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బీజేపీ శ్రేణులతో కలిసి పగడాల కృష్ణ విజయమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పగడాల కృష్ణ మాట్లాడుతూ 40 వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
