58 వ డివిజన్ లో బొడ్డు నాగలక్ష్మి ఇంటింటి ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
58 వ డివిజన్ లో బీజేపీ అభ్యర్ధి బొడ్డు నాగలక్ష్మి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. డివిజన్ లో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో చివరి రోజైన శుక్రవారం తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బీజేపీ శ్రేణులతో కలిసి బొడ్డు నాగలక్ష్మి కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో పశ్చిమ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. 58 వ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ బాసటగా నిలుస్తానని ఆమె స్పష్టం చేశారు. మరింత అభివృద్ధి కొరకు కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కృష్ణ కు గ్లాస్ గుర్తుపై, తనకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బొడ్డు నాగలక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.