అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ, పార్టీ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో పరిస్థితులను సమావేశంలో సమీక్షించారు.
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించిన అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిటీ సభ్యులకు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు బి. మహేందర్ రెడ్డి, ఏవీ రత్నం, కళ్యాణం శివ శ్రీనివాస్, చిలకం మధుసూదన్ రెడ్డి, చిల్లపల్లి శ్రీనివాసరావు, పాలవలస యశస్విని, వేములపాటి అజయ్ కుమార్, పి. ప్రశాంత్, పెండెం దొరబాబు, పెనుగొండ సుబ్బరాయుడు, యనమల భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
