విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ

-టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకుడు జీఎంసీ బాబు.. ఆయనతో పాటు 40 మంది అనుచరులు చేరిక
-కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నాయకుడు జీఎంసీ బాబు తన 40 మంది అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన కార్యాలయంలో వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎంపీ కేశినేని చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి 33వ డివిజన్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని ఎన్నికల ప్రచారం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారితో చర్చించారు.

ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి స్నేహ, సంతోష్, సీనియర్ టీడీపీ నాయకులు కాజా, కోనేరు కిషోర్, ఎర్నేని వేదవ్యాస్, సల్మాన్, సయ్యద్ భజా, సయ్యద్ అహ్మద్ అలీ, యాహు, షేక్ అస్గర్, బత్తుల కాశీ విశ్వనాథ్, బత్తుల రవీంద్ర, రాఘవేంద్ర ప్రసాద్, బత్తుల ప్రసాద్, బత్తుల పెద్ద కాశీ, సుధీర్, షేక్ సుభాని, షేక్ హమీద్, షేక్ అమానుద్దీన్, చంద్రశేఖర్, సురేష్ బాబు, సయ్యద్ రహమతుల్లా, ఇమ్రాన్, మోసిన్, మోయిన్, శ్యామ్, షబ్బీర్, ఎస్.కే. మున్నా తదితరులు పాల్గొన్నారు.