గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మాదిగ కార్పొరేషన్ చైర్మన్, తాడికొండ మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణను లక్ష్మీపురంలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ అపర్ణకు ఉండవల్లి శ్రీదేవి అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి పాలన అందిస్తూ వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఇరువురు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక పరిస్థితులపై చర్చించుకున్నారు.
మేయర్ లక్ష్మీ అపర్ణకు ఉండవల్లి శ్రీదేవి అభినందనలు
