యర్నగూడెం గ్రామ అభివృద్ధికి కూటమి అభ్యర్థి బొల్లిన పద్మజకు మద్దతివ్వండి

-మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి – దేవినేని ఉమా

తూర్పుగోదావరి జిల్లా (గోపాలపురం), నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బొల్లిన పద్మజ గారికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దేవినేని ఉమా పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి కూటమి అభ్యర్థి బొల్లిన పద్మజ గారికి మద్దతు తెలియజేయాలని కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఎర్నగూడెం గ్రామ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థి బొల్లిన పద్మజ గారికి మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్ర్చి సుబ్బరాజు, సీనియర్ నాయకులు బల్ల సూర్యచక్రం తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.