పాల్వంచలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు

భద్రాద్రి కొత్తగూడెం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు సంస్థ ప్రాంగణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
పాల్వంచకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.