-వ్యక్తిత్వ వికాస శిక్షణ, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించనున్న అంబేద్కర్ స్టడీ సర్కిల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష–2026లో అర్హత సాధించి, తదుపరి దశ పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అర్హులైన అభ్యర్థులకు ఉచిత మాక్ ఇంటర్వ్యూలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ కార్యదర్శి, సంచాలకులు ఎన్. మోహనరావు తెలిపారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రముఖ విద్యావేత్తలు, ప్రస్తుత, పదవీ విరమణ చేసిన సివిల్ సర్వెంట్లు, వివిధ రంగాల నిపుణులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ విధానం, సమాచార వినిమయ నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, వ్యక్తిత్వ మదింపు వంటి అంశాలపై శిక్షణ అందించడంతో పాటు అభ్యర్థులకు వ్యక్తిగత సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం కల్పిస్తామని వివరించారు.
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు వెబ్సైట్: https://apstudycircle.apcfss.in/
అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు నమోదు చేసుకుని ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్. మోహనరావు కోరారు.
