ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

-తుది నివేదిక ప్రకారం 75.83 శాతం పోలింగ్ నమోదు
-3,11,318 మంది ఓటర్లకు గాను 2,36,084 మంది ఓటు హక్కు వినియోగం
-రెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 86.39 శాతం పోలింగ్
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, సజావుగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, జిల్లా వ్యాప్తంగా తొలి దశలో మొత్తం 75.83 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం 72 గ్రామ పంచాయతీలు, 959 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 3,11,318 మంది ఓటర్లకు గాను 2,36,084 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

గంటల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు:
* ఉదయం 8:00 గంటల వరకు 45,821 .. 14.72%
* ఉదయం 9:00 గంటల వరకు 91,734… 29.47%
* ఉదయం 10:00 గంటల వరకు 1,35,995 … 43.68%
* ఉదయం 11:00 గంటల వరకు 1,81,164 … 58.19%
* మధ్యాహ్నం 12:00 గంటల వరకు 2,13,263 … 68.50%
* మధ్యాహ్నం 1:00 గంటల వరకు (తుది నివేదిక) 2,36,084 … 75.83%

తొలి దశ ఎన్నికలు జరిగిన ఐదు మండలాల్లో రెడ్డిగూడెం మండలం అత్యధికంగా 86.39 శాతం పోలింగ్‌తో మొదటి స్థానంలో నిలవగా, జి.కొండూరు మండలం 86.19 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

మండలాల వారీగా నమోదైన తుది పోలింగ్ వివరాలు

జి.కొండూరు
గ్రామపంచాయతీలు .. 22
పోలింగ్ కేంద్రాలు .. 219
మొత్తం ఓటర్లు .. 46,569
పోలైన ఓట్లు .. 40,140
పోలింగ్ శాతం .. 86.19%
ఇబ్రహీంపట్నం
గ్రామపంచాయతీలు.. 10
కూలింగ్ కేంద్రాలు .. 132
మొత్తం ఓటర్లు .. 33,759
పోలైన ఓట్లు .. 26,891
పోలింగ్ శాతం .. 79.66%
మైలవరం
గ్రామపంచాయతీలు.. 13
పోలింగ్ కేంద్రాలు .. 174
మొత్తం ఓటర్లు .. 54,728
పోలైన ఓట్లు .. 44,377
పోలింగ్ శాతం .. 81.09%
విజయవాడ రూరల్
గ్రామ పంచాయతీలు .. 16
పోలింగ్ కేంద్రాలు .. 322
మొత్తం ఓటర్లు .. 1,44,407
పోలైన ఓట్లు .. 97,156
పోలింగ్ శాతం .. 67.28%
రెడ్డిగూడెం
గ్రామ పంచాయతీలు .. 11
పోలింగ్ స్టేషన్లు .. 112
మొత్తం ఓటర్లు .. 31,855
పోలైన ఓట్లు .. 27,520
పోలింగ్ శాతం .. 86.39%

ఐదు మండలాల్లో మొత్తం గ్రామపంచాయతీలు 72, పోలింగ్ కేంద్రాలు 959, మొత్తం ఓటర్లు 3,11,318, పోలైన ఓట్లు 2,36,084, పోలింగ్ శాతం 75.83%.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కలెక్టర్ అభినందనలు
తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసు శాఖ మరియు సంబంధిత విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా సహకరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.