అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతిలోని రాయపూడి ఏపీసిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అధికారులు, సిబ్బంది కోసం బుధవారం, 2026 నవంబర్ 18న ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో EVR ఛారిటబుల్ ట్రస్ట్- అమరావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎనికేపాడు, విజయవాడకు చెందిన వైద్య సిబ్బంది APCRDA అధికారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలైన రక్తపోటు(బి.పి.- B.P.), రక్తంలో చక్కెర స్థాయి(బ్లడ్ షుగర్ – G.R.B.S.), కంటి, దంత, న్యూరాలజీ, 2D ఎకో, కార్డియాలజీ, ENT తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆధారంగా వైద్యుల ఉచిత సలహాలు మరియు సూచనలు (డాక్టర్ కన్సల్టేషన్) అందజేశారు. మొత్తం 210 మంది ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు.
APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి. రాములు గారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ స్పెషలిస్ట్ పి. జ్యోతి, జూనియర్ OHS స్పెషలిస్ట్ వి.హరికృష్ణ, ESMU విభాగ సిబ్బంది సమన్వయంతో వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
