66వ డివిజన్ ను మోడల్ డివిజన్ గా తిర్చిదిద్దుతా అవకాశం ఇవ్వండి… : డాక్టర్ వెంకట చరణ్ తేజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
66వ డివిజన్ ను అభివృద్ది చేసేందుకు తనకు కార్పొరేటర్ ఒక్క అవకాశం ఇవ్వాలని 66వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ వెంకట చరణ్ తేజ అన్నారు. గురువారం స్థానిక 66వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ ను నగరంలోనే ప్రతిష్టాత్మకంగా మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వైద్యుడినైన తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. తన ప్రచారంలో అనేక సమస్యలను గుర్తించానని వాటన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు. కనీసం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కోట్లాది రూపాయ ల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్, యూజీడీ సేవలను ప్రజలకు అందించటంలో పాలకులు కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ డివిజన్ అధ్యక్షుడు దొంతిబోయిన దుర్గారావు మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవం తుడు, వైద్యుడు డాక్టర్  వెంకట చరణ్ తేజతోనే డివిజన్ అభివృద్ది సాధ్యమని అన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.