నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో నాగాయలంక జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం పరిశీలించారు. శిబిరంలో పునరావాసం పొందుతున్న తుఫాన్ బాధితులను పరామర్శించారు. బాధితుల కోసం అధికారులు చేసిన ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలను పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఎవరూ ఇళ్లకు వెళ్ళవద్దని ఎమ్మెల్యే సూచించారు. బాధితులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత త్రాగునీటిని అందించాలని సూచించారు. శిబిరం ఆవరణలో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో పునరావాస శిబిరాన్ని నిర్వహించాలని సూచించారు.
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
