-మంత్రి సత్యకుమార్‌కు బాధ్యతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అక్టోబరు 26న విజయవాడలో పర్యటించనున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకడం, వెంట ఉండడం, వీడ్కోలు పలికే బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ui యాదవ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అక్టోబరు 19న అందిన లేఖ ఆధారంగా ముఖ్యమంత్రి తరపున ప్రతినిధిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడలో వార్షికోత్సవ వేడుకలు
ఉపరాష్ట్రపతి అక్టోబరు 26న ఉదయం 10.05 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అంబేడ్కర్ కళావేదిక, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనానికి వెళ్తారు. ఉదయం 11 నుంచి 12.10 గంటల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని, ఒంటిగంటకు తిరుపతికి బయలుదేరుతారు.
తిరుమల శ్రీవారి దర్శనం
మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం సమయం కేటాయించారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.
27న ఢిల్లీకి పయనం
అక్టోబరు 27న ఉదయం పద్మావతి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఉదయం 8.15 గంటలకు ఢిల్లీకి బయలుదేరి, 10.55 గంటలకు చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకుంటారు.
