విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర అభివృద్ధికి మరోసారి అవకాశం కల్పించాలని విజయవాడ నగర మున్సి పల్ కార్పొరేషన్ మాజీ మేయర్, వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ప్రజలను కోరారు. 2021 నుంచి 2026 వరకు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్తా మని ఆమె తెలిపారు. గురువారం గాం ధీనగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఐదేళ్లలో నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయా లు కల్పించేందుకు కృషి చేశామని రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. మరో సారి అవకాశం కల్పిస్తే నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చే స్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకుడు అవినాష్ మాట్లాడుతూ మహిళా మేయర్ గా రాయన భాగ్యలక్ష్మి తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారని అన్నారు. గత ఐదేళ్లలో నగ రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఆమె పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని వాస్ మాట్లాడుతూ రాయన భాగ్యలక్ష్మి మేయర్ గా ఉన్న సమయంలో డ్రైనేజీ పనులు, తాగునీటి సమస్యల పరిష్కా రం, పార్కుల సుందరీకరణ వంటి కా ర్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని తె లిపారు. బుడమేరు పొంగిన సమయం లో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజ లు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో మురుగునీటి నిల్వల సమస్యల పరిష్కా రానికి ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లా డుతూ విజయవాడ నగర అభివృద్ధికి రాయన భాగ్యలక్ష్మి చేసిన సేవలు గుర్తించదగినవని అన్నారు.
గత ఐదేళ్లలో ఆ మె మేయర్ గా పనిచేసిన తీరును ప్రస్తా విస్తూ, వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. వైఎస్సార్సీపీ అధి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రస్తావించిన మల్లాది విష్ణు, ప్రస్తుత కూ టమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఆశిం చిన ప్రయోజనాలు అందడం లేదని వ్యాఖ్యానించారు. విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమావేశంలో నాయకులు తమ అభిప్రా యాలను వెల్లడించారు. రాబోయే రో జుల్లో నగర అభివృద్ధికి కృషి చేస్తామని, రాయన భాగ్యలక్ష్మికి మరోసారి అవకా శం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. ఈ సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
