విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలపరిచిన జనసేన పార్టీ 37 వ డివిజన్ జనసేన అభ్యర్థి గుడిపాటి కిషోర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కూటమి నేతలు లింగం శివప్రసాద్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బావి శెట్టి శ్రీనివాస్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కోరారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు గురువారం 37 వ డివిజన్ లో గుడిపాటి కిషోర్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ గుడిపాటి కిషోర్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
గుడిపాటి కిషోర్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం
