యువ నాయకుడు ఏలూరు సాయి శరత్ ను గెలిపించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
యువ నాయకుడు, జనసేన పార్టీ, కార్పొరేటర్ అభ్యర్థి ఏలూరు సాయి శరత్ ను గెలిపించాలని కూటమినేతలు పిలుపునిచ్చారు. సాయి శరత్ కు మద్దతుగా మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ సీనియర్ నాయకులు రేగళ్ల లక్ష్మణరావు గురువారం కామకోటి నగర్ లో ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి స్థానికులకు వివరించారు. చెప్పాం.. చేసాం నినాదంతో కూటమి పాలనలో సంక్షేమం గడపగడపకు చేరిందన్నారు. ఇదే అభివృద్ధి మరింత కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే ఏలూరు సాయి శరత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.