-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 76వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మార్తి సుధారాణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ప్రజలను కోరారు. డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపి ఆమెను కూడా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: రాయన భాగ్యలక్ష్మి
మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గత మూడేళ్ల పాలనలో విజయవాడ నగరంలో సంక్షేమం, అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. బుడమేరు వరదల సమయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాధితులకు తగిన సహాయం అందలేదని పేర్కొన్నారు. నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పాలకులకు ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరారు. నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం: మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులకు గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరోధం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. బియ్యం, వంటనూనె, పంచదార, పాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, పేదలు, భర్తను కోల్పోయిన మహిళల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పెన్షన్లు అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేందుకు మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని మల్లాది విష్ణు కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
